శంక యేల....శంకరుడవు కాగా… | Lingodbava | Inner Shiva | Devotional Short
Feb 15, 2026
శంక యేల....శంకరుడవు కాగా…
కాలం కంటే ముందు, అంతరిక్షము ఏర్పడడానికంటే ఎంతో ముందు, శబ్ద నాదానికి ముందు కేవలం ఉనికి మాత్రమే ఉంది, ఎలాంటి ఆద్యంతాలు తెలియని, ఎలాంటి రూపం లేకుండా నిర్మలమై ఉన్నది ఆ ఉనికి యొక్క చైతన్యం. ఈ చైతన్యాన్ని మన ఋషులు శివుడన్నారు. శాస్త్రజ్ఞులు విశ్వం యొక్క శక్తిగా పేర్కొన్నారు. ఈ చైతన్య శివ శక్తి యొక్క సత్యాన్ని లింగోద్బవ కథ రూపములో ఋషులు చెప్పారు. లింగోద్బవం అనేది సృష్టి మొదలైన క్షణం కాదు సత్య దర్శనం అయిన క్షణం. ఈ కథలో బ్రహ్మ పైకి వెతికాడు…విష్ణువు కిందికి వెతికాడు…ఈ కథలో బ్రహ్మ అంటే మానవుల ఆలోచనల సృష్టికి ప్రతీక, విష్ణువు అంటే అర్థం చేసుకోవాలనుకునే మానవుల బుద్ధికి ప్రతీక. ఇది దేవతల ప్రయాణం కాదు — మానవులు చైతన్యం గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నం. ఎందుకంటే ఆద్యంతాలు తెలియని చైతన్యాన్ని కొలవలేము… చూడలేము… కనుగొనలేము....
అది కేవలం అనుభవించగలిగేది.
ఈ చైతన్యశక్తి ఆధారమే శివ స్వరూపం. అదే నేను అదే నువ్వు.
నేను మనసు కాదు నేను శరీరం కాదు నేను ఆలోచన కాదు నిర్వాణ షట్కంలో ఈ సత్యాన్ని ఆదిశంకరాచార్యులు స్పష్టంగా చెప్పారు.
ప్రతి మనిషిలో ఒక నిశ్శబ్ద కేంద్రం ఉంది.
ఆలోచనలు ఆగే చోటు…అహంకారం కరిగే చోటు…అక్కడే శివుడు ఉన్నాడు.
లింగం ఒక రాయి కాదు… ఒక గుర్తు.
విశ్వానికి అక్షంలా…మన వెన్నెముకలో ప్రవహించే శక్తిలా…
సృష్టి అవగాహనకు రూపం.
చిదానంద రూపః శివోహం శివోహం…
ఇది ప్రార్థన కాదు —ఒక అనుభవం.
శంక యేల....శంకరుడవు కాగా…
మనలోని ప్రశ్న మాయమైతే, మిగిలేది చైతన్యమే.
ఓం నమః శివాయ. చిదానంద రూపః శివోహం శివోహం…
శంక యేల....శంకరుడవు కాగా…
This short devotional visual story explores the deeper meaning of Lingodbava and the realization that the divine consciousness we call Shiva exists within every human being.
Blending spiritual philosophy, cosmic imagination, and the essence of Nirvana Shatkam, this video reflects on the idea that infinity cannot be measured — only experienced.
Show More Show Less #People & Society

